థర్డ్ ఎంపైర్: క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చారేమిటబ్బా?

praveen
అవును, వినడానికి విచిత్రంగా వున్నా మీరు విన్నది నిజమే. ఇలాంటి సంఘటన బిగ్ బాష్ లీగ్-2022లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చోటు చేసుకుంది. రెనిగేడ్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా నాన్ - స్ట్రైకర్ టామ్ రోజర్స్ ని రనౌట్ (మన్కడింగ్) చేయడానికి ట్రై చేసాడు. కాగా జంపా బంతి వేయకముందే రోజర్స్ క్రీజును వదిలి బయటకు వెళ్ళిపోయాడు. సరిగా అది గమనించిన అతడు వెంటనే వికెట్లను గిరాటేశాడు.
దీంతో ప్రత్యర్ధులు రనౌటు అప్పీల్ చేసేసరికి, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ కి డెసిషన్ వదిలేసాడు. దాంతో ఆ సీన్ ని పలు మార్లు రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించి అందరినీ అవాక్కయేలా చేసాడు. ఇంతకీ విషయం ఏమంటే కొత్త రూల్స్ ప్రకారం రనౌట్ (మన్కడింగ్) సాధారణ రనౌట్ గానే పరిగిణిస్తారు. ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ మాత్రం ఎందుకు నాటౌట్ ప్రకటించాడన్నది మొదట ప్రేక్షకులకు బోధ పడలేదు. దాంతో అంతా బిక్కముఖాలు వేసుకొని చూసారు.
ఇక దానిని థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడో ఇపుడు తెలుసుకుందమా? మెరిలోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకున్న యెడల యాక్షను పూర్తి చేయకముందే ఔట్ చేయాల్సి ఉంటుంది. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలన్నమాట. కానీ ఇక్కడ అది జరగలేదు. జంపా మాత్రం తన బౌలింగ్ యాక్షనన్ను పూర్తి చేసిన తరువాత స్టంప్స్ ని గిరాటు వేసాడు. అక్కడే తడబడ్డాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్లో మెల్బోర్న్ స్టార్స్పై రెనెగేడ్స్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిందనే విషయం అందరికీ తెలిసినదే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: