యాక్సిడెంట్.. ఆ టెస్ట్ సిరీస్ కు పంత్ దూరం?

praveen
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవలే రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో భాగంగా తీవ్రంగా గాయాల పాలయ్యాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడిన నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.


 ఇక రిషబ్ పంత్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో అని అప్డేట్ గురించి కూడా అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్ ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం మునుపటి ఫామ్ ను అందుకొని మంచి ప్రదర్శన చేశాడు  ఇక కొత్త ఏడాదిలో అటు ఇండియా ఆడబోయే టెస్ట్ సిరీస్లలో కూడా రిషబ్ పంత్ కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే ఊహించిన విధంగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో రిషబ్ పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు దూరం కాబోతున్నట్లు బీసీసీఐ వర్గాలనుంచి సమాచారం. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగపూర్ వేదికగా అటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే జరిగిన ప్రమాదంలో మోకాలు చీలమండ దగ్గర పంత్ కు తీవ్రంగా గాయాలు కావడంతో అతను కోలుకునేందుకు దాదాపు రెండు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ కు అతను దూరం అవుతాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: