అభిమాని అత్యుత్సాహం.. చివరికి ముక్కు పగిలింది?

praveen
మనకు రానిది ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం కంటే సైలెంట్ గా ఉండడం మేలు అని ఎంతమంది పెద్దలు చెప్పినా కొంతమంది మాత్రం కొన్ని కొన్ని సార్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చివరికి చేదు అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు అని చెప్పాలి. ఏకంగా స్టేడియంలో ఎవరూ లేరు. కేవలం తాము ఒక్కరం మాత్రమే ఉన్నాం అన్నట్లుగా కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు ఏదో ఒకటిచిత్ర విచిత్రంగా ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మైదానంలోకి దూసుకు వచ్చే బంతిని ఏకంగా ప్రొఫెషనల్ క్రికెటర్ల లాగా క్యాచ్ పట్టడానికి ప్రయత్నించి చివరికి గాయాల బారిన పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఇటీవల బ్రిస్ బెన్  హీట్, సిడ్నీ తండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే సిడ్నీ తండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ   దూకుడుగా ఆడుతుండగా.  అతను కొట్టిన ఒక భారీ సిక్సర్ కాస్త స్టేడియంలో ఉన్న ప్రేక్షకుడి మూతి పగలగొట్టింది అని చెప్పాలి. 56 పరుగుల వద్ద ఉన్న సమయంలో లాంగ్ ఆన్  దిశగా భారీ సిక్సర్ కొట్టాడు బ్యాట్స్మెన్.



 బంతి నేరుగా స్టాండ్స్ వైపు దూసుకుపోయింది. కాగా స్టాండ్స్ లో నిలబడి ఉన్న ఒక అభిమాని ఇక బంతిని చూసి పక్కకు తప్పుకోకుండా కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఏకంగా ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ఎంతో దూరం నుంచి దూసుకు వస్తున్న బంతిని క్యాచ్ అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా వెళ్లి అతని ముక్కు నోరు కు గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా అతని కళ్ళు బైర్లు కమ్మాయి అని చెప్పాలి. అయినప్పటికీ మానేజ్ చేసుకోవడం కోసం తనకి ఏమీ కాలేదు అన్నట్లుగా ఒక సింబల్ చూపించాడు. కానీ కాసేపటికి సదరు అభిమాని ముక్కు నుంచి నోటి నుంచి రక్తం ధారల కారడం కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: