అతనిలా ఆడితే.. ఈజీగా త్రిబుల్ సెంచరీ కొట్టొచ్చు : గవాస్కర్
టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్ ఏకంగా మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఇప్పటికి ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు అని చెప్పాలి. అప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకోవడంతో టీమిండియా ఫ్యాన్స్ అందరు నిరాశలో మునిగిపోయారు. అలాంటి సమయంలో నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్ తో చెలరేగిపోయాడు. అత్యంత వేగంగా వన్డేలలో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్ ముందు ప్రత్యర్థి బంగ్లాదేశ్ బౌలర్లు అందరూ కూడా చేతులెత్తేసారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ గురించి స్పందించిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది అత్యున్నత ప్రదర్శన ఇచ్చిన బ్యాట్స్మెన్ గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసాడు సునీల్ గవాస్కర్.
బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన తీరు చూస్తే 300 కొడతాడని అనుకున్నాను. అయితే అవుట్ కాకపోయి ఉంటే తప్పకుండా అతను 300 పరుగులు చేసేవాడు. అప్పటికి ఇంకా 14 ఓవర్ల ఆట మిగిలే ఉంది. మైదానానికి నలువైపులా ఇషాన్ కిషన్ అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇక రిషబ్ పంతు లాగా బ్యాటింగ్ చేశాడు. చిన్న వయసులోనే డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం నిజంగా గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించాడు సునీల్ గవాస్కర్. ఇషాన్ కిషన్ లాగా ఆడితే మాత్రం ఫ్యూచర్లో వన్డే ఫార్మాట్లో కూడా త్రిబుల్ సెంచరీ సాధించే అవకాశాలు ఎంతో మందికి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.