వారెవ్వా.. ప్రపంచ రికార్డు కొట్టేసిన.. అయ్యర్ - అశ్విన్ జోడి?
తక్కువ టార్గెట్ మాత్రమే ఉండడంతో ఎంతో అలవోకగా టీమిండియా విజయం సాధిస్తుందని ముందుగా భావించారు టీమిండియా అభిమానులు. కానీ ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ విభాగం పేక మెడల కూలిపోయింది. ఎంతలా అంటే 74 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. దీంతో ఇక రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా గెలవడం కష్టమే అని భావించారు. ఇలాంటి సమయంలోనే శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ 71 పరుగుల భాగస్వామ్యంతో గెలిపించారు. బ్యాటింగ్ చేయడానికి ఎంతో కష్టంగా ఉన్న పిచ్ పై పరుగులు రాబడుతూ టీమ్ ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ శ్రేయస్ అయ్యర్ జోడి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించిన అయ్యర్ అశ్విన్ జోడి టీమిండియా తరఫున టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో తొలి స్థానంలో లాలా అమర్ సింగ్ - లాల్ సింగ్ జోడి ఉన్నారు అని చెప్పాలి. 1992లో ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే టీమిండియా కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కూడా కావడం గమనార్హం. ఇక ఆ తర్వాత మూడవ స్థానంలో కపిల్ దేవ్ - లక్ష్మణ్ శివరామకృష్ణన్ జోడి ఉన్నారు అని చెప్పాలి. 1985లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 8వ వికెట్ కు 70 పరుగులు జోడించింది వీరి జోడి.