తండ్రిని డకౌట్ చేసిన కొడుకు.. వైరల్ వీడియో?
అయితే ఇలా మాజీ క్రికెటర్ల వారసులు క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక తండ్రి కొడుకులు కలిసి మ్యాచ్ ఆడటం మాత్రం దాదాపు చూడలేము అని చెప్పాలి. ఎందుకంటే కొడుకులు మంచి క్రికెటర్ గా ఎదిగే సమయానికి తండ్రులు క్రికెట్ కి పూర్తిగా దూరమైపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా తండ్రీకొడుకులు ఇద్దరు కలిసి ప్రత్యర్థులుగా మారిపోయి క్రికెట్ ఆడటం చూసి ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులు అయ్యారు అని చెప్పాలి. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్.. అతని తనయుడు అలి రజాక్ మధ్య పోటీ జరిగింది. ఈ క్రమంలోనే తనయుడు అలీ రజాక్ తండ్రిని గోల్డెన్ డక్ చేయడం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
కింగ్ డమ్ వాలి మెగా స్టార్స్ లీగ్ 2022లో భాగంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. రావల్పిండి వేదికగా షెఫవర్డ్ పటాన్స్, కరాచీ నైట్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ షెఫవర్ ఫటాన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా.. అతని తనయుడు కరాచీ నైట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే షఫావర్ పటాన్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే అలీ రజాక్ బౌలింగ్ వేసాడు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తండ్రి అబ్దుల్ రజాక్ ఓపెనర్ గా వచ్చాడు. అయితే ఓవర్ తొలి బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ వేయాగా రజాక్ బ్యాట్ ని తగిలించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో ఇక కొడుకు చేతుల్లో అబ్దుల్ రజాక్ చివరికి గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.