క్రికెట్ చరిత్రలో తొలిసారి.. 6 పరుగులకే ఆలౌట్?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో అటు యువ ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. దేశ వాలి క్రికెట్ లో జరుగుతున్న ప్రతి టోర్నీలో కూడా ఎంతోమంది యువ ఆటగాలు సత్తా చాటుతున్నారు. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా భారత సెలక్టర్ల చూపును కూడా ఆకర్షిస్తూ అటు టీమిండియాలోకి అరంగేట్రం చేస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య కూడా నేటి రోజుల్లో అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్న ఆటగాళ్లు ఎలా కనిపిస్తున్నారో.. చెత్త ప్రదర్శనతో చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటున్న ఆటగాళ్లు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా ఇలాంటి ఒక చెత్త రికార్డు నమోదయింది.. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా అండర్ 16 స్థాయిలో ప్రస్తుతం మ్యాచులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లలో చెత్త రికార్డు నమోదయి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా సిక్కిం జట్టు ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి.

 ఈ మ్యాచ్ లో భాగంగా తొలత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 8 వికెట్లు నష్టానికి 414 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిక్కిం జట్టు తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 6 పరుగులకే సిక్కిం బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది  మధ్యప్రదేశ్ బౌలర్ల దెబ్బకు ఏడుగురు సిక్కిం బ్యాట్స్మెన్లు పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుదిరుగారు అని చెప్పాలి. దీంతో అత్యల్ప  స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు సృష్టించింది సిక్కిం జట్టు. దీంతో మధ్యప్రదేశ్ చెట్టుజట్టు 365 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: