అతని వల్ల.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానానికి ఎసరు పడింది : ఆకాష్ చోప్రా
ఇకపోతే ఇటీవల యువ ఆటగాడు శుభమన్ గిల్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. రోహిత్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేశాడు. ఇలా తన కెరీర్ లోని తొలి టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ లతో 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఇక అతను ఓపెనర్ గా ఫిక్స్ అవడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఇక ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న శుభమన్ గిల్ రాహుల్ ఓపెనింగ్ స్థానానికి ఎసరు పెట్టే అవకాశం ఉంది అంటే అభిప్రాయపడ్డారు ఆకాష్ చోప్రా. ఎందుకంటే ప్రస్తుతం అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. బంగ్లాదేశ్ తో రెండవ ఇన్నింగ్స్ లో కలిపి 45 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే ఇక మొదటి మ్యాచ్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్ రాసిన రెండో టెస్ట్ మ్యాచ్ కు పక్కన పెట్టే అవకాశం ఉంది కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం శుభమన్ గిల్ మంచి ఫామ్ లో ఉండడంతో రాహుల్ అతని స్థానం కోల్పోయే అవకాశం ఉంది. రోహిత్ తిరిగి జట్టులోకి చేరితే వీరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక నా అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.