షాకింగ్ : పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా రమిజ్ రజా ఔట్?

praveen
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రమిజ్ రజా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం భారత క్రికెట్ నియంత్రణ మండలి విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఎంతో హుందాగా ప్రవర్తించాల్సి వస్తుంది అని చెప్పాలి. ఇక విమర్శలు చేస్తున్నప్పుడు కూడా అంతే హుందాగా ఉండాలి. కానీ రమిజ్ రజా మాత్రం ఆ హుందాతనాన్ని మరిచిపోయి ఏకంగా బిసిసిఐపై ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేయడం చేశారు. బిసిసిఐ పై తన అక్కసును వెలగకుతూ తరచూ వార్తలో నిలిచారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా గత కొంతకాలం నుంచి బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రమిజ్ రజా ఇక ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగిపోయే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇందుకు కారణం బీసీసీఐ పై విమర్శలు చేయడం కాదు.. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేక విమర్శలు ఎదుర్కొంటూ ఉండటమే అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల  ఇక ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది ఇంగ్లాండ్ జట్టు.


 ఈ క్రమంలోనే  సొంత గడ్డపై అటు పాకిస్తాన్ జట్టు అదరగొడుతుందని అందరూ భావించారు.  కానీ ఊహించిన రీతిలో అటు పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ దూకుడైన ఆట తీరు ముందు నిలువ లేకపోయింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి కూడా నిష్క్రమించింది. సొంత గడ్డపై పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్న రమిజ్ రజాని తప్పించి గతంలో బోర్డు చైర్మన్ గా పనిచేసిన నజం సేతినే మళ్లీ అధ్యక్షుడిగా చేయాలని బోర్డు సభ్యులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: