టెస్ట్ సిరీస్.. కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్?

frame టెస్ట్ సిరీస్.. కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్?

praveen
ఇప్పటికే తాను ఎంత అత్యుత్తమమైన ఆటగాడినో నిరూపించిన విరాట్ కోహ్లీ.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. దిగ్గజాలు సాధించిన రికార్డులను తక్కువ సమయంలోనే బ్రేక్ చేశాడు. మొన్నటి వరకు మూడు సంవత్సరాలు పాము కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమం లోనే ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ మునుపటి ఫామ్ నూ అందుకున్న విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు అని చెప్పాలి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. అయితే ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు.


 టి20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ అందుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో మరోసారి సెంచరీ తో నిరీక్షణకు విరాట్ కోహ్లీ తెరదించాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీని ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ లో మరో అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. ఒకవేళ బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు అంటే ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు.


మహేళ జయవర్ధనే (2010), సురేశ్‌ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్‌ (2011), అహ్మద్‌ షెహజాద్‌ (2014), తమీమ్‌ ఇక్బాల్‌ (2016), కేఎల్‌ రాహుల్‌ (2016), రోహిత్‌ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్‌ ఆజమ్‌ (2022) సరసన చేరతాడు. వీరందరూ కూడా ఒకే క్యాలెండర్లో మూడు ఫార్మట్ లలో కూడా సెంచరీ సాధించిన ప్లేయర్ లుగా కొనసాగుతున్నారు. కాగా ప్రస్తుతం ఫామ్ లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే 72 సెంచరీలు సాధించాడు అన్న విషయం తెల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: