దూసుకొచ్చిన ఆసీస్ బ్యాటర్.. టి20లలో నెంబర్.1 ర్యాంక్?
ఇక ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ లో ఈ అవకాశం వచ్చింది అంటే ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఐసీసీ టీ20 ఉమెన్స్ ర్యాంకింగ్స్ నూ ఇటీవల విడుదల చేసింది. కాగా మహిళల జట్టులో టి20 సిరీస్లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ మేక్ గ్రోత్ ఇక అందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకు వెళ్లింది అని చెప్పాలి. దీంతో ఈ లేడీ క్రికెటర్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఉండగా.. ముంబై వేదికగా ఇటీవల 2 టీ20 మ్యాచ్ జరిగాయి.
రెండు టీ20 మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న మెక్ గ్రాత్ ఏకంగా 110 పరుగులు చేసింది అని చెప్పాలి. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది. తన సహచర క్రికెటర్లు అయిన బెత్ మూని, మేక్ లానింగ్, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందానాలను అధిగమించి టాప్ ర్యాంకు దూసుకుపోయింది. కాగా ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు కూడా తొలి స్థానంలో బెత్ మూని టాప్ ప్లేస్ లో కొనసాగింది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన 12వ ఆస్ట్రేలియా బ్యాటర్ గా మెక్ గ్రాత్ అరుదైన రికార్డును కూడా సృష్టించింది.