విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు.. ఓటమీ రుచి చూపించిన భారత్?

praveen
గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది టీమిండియా మహిళల జట్టు. ముఖ్యంగా హార్మన్ ప్రీత్ కౌర్  చేతికి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత ఇక టీమిండియా మరింత దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి పై ఆదిపత్యం కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి. మూడు ఫార్మట్లలో కూడా హావా నడిపిస్తూ ఉంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే తమదైన వ్యూహాలతో కట్టడి చేసి చివరికి చిత్తుగా ఓడించడం చేస్తుంది. ఇకపోతే ఇటీవల వరుస విజయాలతో దూసుకు వస్తున్న పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి అద్భుత విజయాన్ని అందుకుంది.


 ఆస్ట్రేలియా జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ఎవరైనా సరే  చిత్తు చేస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే ఇక అలా వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియా తో భారత మహిళల జట్టు టి20 సిరీస్ ఆడుతుంది. ఇటీవల రెండవ టి20 మ్యాచ్లో ఏకంగా ఆస్ట్రేలియా కు ఓటమి రుచి చూపించింది భారత జట్టు. అపజయమే లేకుండా దూసుకుపోతున్న ఆస్ట్రేలియా విజయాల పరంపరకు భారత జట్టు బ్రేక్ వేసింది.


కాగా ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా వరుసగా 16 మ్యాచులు గెలిచింది అని చెప్పాలి. ఏకంగా ఒక్క టి20 కూడా ఓడిపోలేదు.  దీన్నిబట్టి ఆస్ట్రేలియా జట్టు ఇక టి20లలో ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఇక భారత మహిళల జట్టు ఓడించి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. రెండో టి20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరగగా  చివరికి మ్యాచ్ టై గా ముగిసింది. ఆ తర్వాత రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించడంతో ఇక సూపర్ ఓవర్ లో టీం ఇండియా ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: