ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షమి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న ఆటగాళ్ళు అందరూ కూడా నిర్విరామంగా  క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. ఇక వరుసగా గాయాల బారిన పడుతూనే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో  ఎప్పటికప్పుడు భారత జట్టులో కొత్త ఆటగాళ్లు దర్శనమిస్తూనే ఉన్నారు  ఇకపోతే ఇటీవల టీమిండియా జట్టులో సీనియర్ బౌలర్గా కొనసాగుతున్న షమి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో జట్టులోకి ఎవరూ రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ గాయపడిన నేపథ్యంలో ఒక సీనియర్ బౌలర్ కి అదృష్టం వరించింది అన్నది తెలుస్తుంది. ఎన్నో రోజులుగా టీమిండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సీనియర్ బౌలర్ జయదేవ్ ఉన్నాద్గత్ కు ప్రస్తుతం భారత జట్టులోకి పిలుపు వచ్చింది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులోకి వచ్చే జయదేవ్ బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం మహమ్మద్ షమీ స్థానంలో టీమ్ ఇండియాలో ఆడబోతున్నాడు. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అని చెప్పాలి.


 చేతికి గాయం అయిన కారణంగా మహమ్మద్ షమీ ఇటీవల సిరీస్ నుంచి వైదొలిగాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 2010లో భారత జట్టులోకి అరేంగేట్రం చేసిన 31 ఏళ్ల జయదేవ్ ఆ ఏడాది కేవలం రెండు టెస్ట్ మ్యాచ్ లలో మాత్రమే ఆడాడు   ఇక తర్వాత ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు  అని చెప్పాలి. ఏడు వన్డే మ్యాచ్లు, పది టి20లలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు  ఇటీవల విజయ్ హాజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ జట్టులోకి వచ్చాడు అనేది తెలుస్తుంది. ఇక ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అతను ఎలా వినియోగించుకోబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: