సూర్య కుమార్ అసలు మనిషేనా.. ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
గత కొంతకాలం నుంచి సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తూ అదరగొడుతూ ఉన్నాడు. క్రీజు లోకి వచ్చి కుదురుకోవడం కాదు సిక్సర్ ఫోర్ లతో సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏదైనా మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్నాడు అంటే చాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే దక్కుతుందేమో అన్న విధంగా అతని ఆట తీరు సాగుతూ ఉంది అని చెప్పాలి.

 ముఖ్యంగా జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదును సొంతం చేసుకున్న సూర్య కుమార్ యాదవ్.. ప్రతి మ్యాచ్ లో కూడా ఇక ఈ బిరుదును సార్థకం చేసే విధంగానే తన బ్యాటింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు.  మిగతా బ్యాట్స్మెన్లు కనీసం సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఏదో పూనకం వచ్చిన వాడిలాగా సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ఆట తీరు చూసిన తర్వాత మాజీ ఆటగాళ్లు అందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం పై మాజీ క్రికెటర్ క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో సెంచరీ తో చలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఇక అతడు ఆడిన షాట్లు ఏవి కూడా నమ్మశక్యంగా లేవు. ఇక అతని బ్యాటింగ్లో కొన్ని షాట్లు చూసిన తర్వాత అతను అందరిలాగే మనిషా లేకపోతే గ్రహాంతరవాస అని అనిపించింది. ఒకవేళ అతడు గ్రహాంతరవాసి అయితే ఏ గ్రహం నుంచి వచ్చాడో ఆ దేవుడికే తెలియాలి అంటూ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: