సూర్య సెంచరీ పై.. హార్థిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా?
ఈ క్రమంలోనే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అతని పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో ఇక భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే ఏకంగా టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ లిస్టులో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనలో కూడా మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు అని చెప్పాలి. ఏకంగా 51 బంతుల్లో 111 పరుగులు చేసి అదరగొట్టాడు సూర్య కుమార్ యాదవ్. అతని బ్యాటింగ్కు తిరుగులేదు అని ఎంతో మంది మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా సూర్య కుమార్ అద్భుతమైన సెంచరీ పై స్పందించిన ప్రస్తుత భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎంతమంది ఆటగాళ్లు ఆడినప్పటికీ సూర్యకుమార్ ఇన్నింగ్స్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అంటూ ప్రశంసలు కురిపించాడు హార్థిక్ పాండ్య. బౌలర్ల పై పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించి అతను బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం అంటూ పొగిడాడు. ఇక మరి కొంతమంది మాజీ ఆటగాళ్లు సైతం అతని వీరోచితమైన సెంచరీపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు.