ఐపీఎల్ వేలంలో కామరూన్ గ్రీన్.. ఆసిస్ కెప్టెన్ ఏమన్నాడంటే?

praveen
ఇటీవల అరోన్ పించ్ వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు కెప్టెన్గా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ రెండు ఫార్మాట్లకు కూడా కొత్త కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ ను నియమిస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఒక ఆటగాడిగా జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన ఈ స్టార్ ప్లేయర్ ఇక ఇప్పుడు కెప్టెన్గా ఎంతవరకు సక్సెస్ కాబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్గా ఉన్న ప్యాట్ కమ్మిన్స్ ఇక రానున్న ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వరుసగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్న కారణంగానే ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే తమ జట్టులో ఉన్న ఆటగాళ్లను మాత్రం ఐపీఎల్ ఆడవద్దు అంటూ ఎలాంటి నిబంధనలు పెట్టబోనని చెప్పుకొచ్చాడు ప్యాట్ కమ్మిన్స్. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ ఇటీవల వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతనికి 2023 ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది. అయితే తమ జట్టు ఆల్రౌండర్ ఐపీఎల్లో ఆడటం గురించి ఇటీవలే ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 2023 ఐపీఎల్ లీగ్ వేలంలోకి రావాలని కామరూన్ గ్రీన్ భావిస్తే అతడి కోసం భారీగా బిట్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్యాట్ కామెంట్స్ స్పందిస్తూ.. అవును.. భారత టి20 లీగ్ వేలంలోకి  కామరూన్ గ్రీన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి చూద్దాం. అయితే ఒక జట్టు కెప్టెన్ గా నేను కొంత స్వార్థంగా ఆలోచిస్తే మాత్రం ఆటగాళ్ల శక్తిని అంతా కూడా దేశం కోసం ఆడేందుకే ఉపయోగించుకోవాలి అని అనుకుంటాను. కానీ భారత టి20 లీగ్ లాంటి గొప్ప అవకాశాన్ని వదులుకోవాలని ఎవరికైనా మనం ఎలా చెప్పగలం అంటూ ప్యాట్ కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL

సంబంధిత వార్తలు: