
బర్నాల్ రాసుకుంటావా.. వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్?
అంతేకాకుండా ఇక టీమిండియా ఎప్పుడు వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ కాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. కాగా అతనికి ఎంతోమంది భారత మాజీ ఆటగాళ్లు కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే 2023 ఐపీఎల్ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టు ఇండియన్ మాజీ ప్లేయర్ వసీం జాఫర్ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే వసీం జాఫర్ మైఖేల్ వాన్ మధ్య ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వసీం జాఫర్ బ్యాటింగ్ కోచ్ గా నియమితం అవడంపై ఏకంగా మైఖేల్ వాన్ సెటైర్లు వేశాడు. ఒకప్పుడు నా చేతిలో వికెట్ కోల్పోయిన వ్యక్తి ఇక ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. అయితే దీనిపై కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్ ఎక్కడో కాలుతున్నట్లు ఉంది బర్నాల్ కావాలా అంటూ కౌంటర్ ఇచ్చాడు.
అయితే ఇక ఇలా వసీం జాఫర్ ఇచ్చిన కౌంటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు. మైఖేల్ వాన్ లాంటి వ్యక్తికి సరైన కౌంటర్ ఇచ్చారు అంటూ ఇక అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.