రోహిత్ కాలం ముగిసింది.. ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వాలి?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అటు టీమిండియా ఘోర వైఫల్యం చెందడాన్ని అటు భారత అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ అతన్ని వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇక రాబోయే వరల్డ్ కప్ కోసం జట్టులో కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే భాగం చేయాలని.. జట్టును యువ ఆటగాళ్లతో నింపివేయాలి అంటూ సూచిస్తున్నారు.


 అయితే వరల్డ్ కప్ లో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్గా ఒక ఆటగాడిగా విఫలం అవడం గురించి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇటీవలే ఇదే విషయంపై భారత మాజీ ఫేసర్ అతుల్ వాసన్ కూడా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్ గా రోహిత్ సమయం ముగిసిందని.. ఇక హార్దిక్ పాండ్యా లేదా రిషబ్ పంతులకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు టి20 ఫార్మాట్లో ఇక రోహిత్ కు కెప్టెన్ గా సమయం ముగిసింది అని భావిస్తున్నాను. అయితే రెండు ప్రపంచ కప్పులను దృష్టిలో పెట్టుకొని రోహిత్ ను కెప్టెన్గా చేశారు.


 కానీ అతన్ని కెప్టెన్ గా మార్చడం ద్వారా అటు భారత క్రికెట్కు ఎలాంటి లాభం లేదు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే మీ ముందు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ రూపంలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించండి. ఇక ఆడి లైడ్ లో ఏం జరిగిందో నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. భారత ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పాలి. ఇంగ్లాండ్ షార్జాలో ఆడినట్లు అనిపించింది. ఇక ఎలాంటి వ్యూహాలు కూడా కనిపించలేదు.  తీసుకున్న  నిర్ణయాలు కూడా మేనేజ్మెంట్ వే. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆతుల్ వాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: