సామ్ కుర్రాన్ కాదు.. అతనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్?

praveen
ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ అటు టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ప్రదర్శన మాత్రం అద్భుతం అని చెప్పాలి. మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రభావం ఎక్కడ తగ్గలేదు అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఏకంగా ప్రతి మ్యాచ్లో కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడి 296 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్  లో కోహ్లీ చేసిన పరుగులే అత్యధిక స్కోర్ గా కొనసాగుతూ ఉండటం గమనార్హం. దీంతో విరాట్ కోహ్లీకి అటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కుతుందని అందరూ భావించారు.


 ఇక విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ విరాట్ కోహ్లీ లేదా సూర్య కుమార్ యాదవ్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ సామ్ కురాన్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు ఇక టి20 వరల్డ్ కప్ మొత్తంలో 13 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన సామ్ కూరాన్  ఇక ఈ అవార్డు దక్కించుకున్నాడు. అయితే ఇదే విషయంపై ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు.


 తన దృష్టిలో మాత్రం విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కాల్సింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 98.67 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. గొప్ప ఆటగాళ్లు జట్టులో కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకొని గొప్పగా ఆడుతారు. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ వరల్డ్ కప్ టోర్నీకే హైలెట్.. నా వరకు విరాట్ కోహ్లీ మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకి అర్హుడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన సమయంలో విరాట్ కోహ్లీ భాద్యత తీసుకొని ఆడాడు అంటూ రికీ పాంటింగ్ ఇటీవల కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: