ఇంగ్లాండ్ అందుకే గెలిచింది.. మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు?
ఇలా సెమీఫైనల్ లో భారత్ ఓడిపోవడం పాకిస్తాన్ మాత్రం సెమీఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరడంతో ఇక పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లందరూ కూడా రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో భారత మాజీ ఆటగాళ్లు సైతం పాకిస్తాన్ మాజీ ప్లేయర్స్ కి కౌంటర్ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి భారత్ పాకిస్తాన్ మాజీ ప్లేయర్ల మధ్య సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి వార్ నడుస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఫైనల్ మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ జట్టు చివరి వరకు బౌలింగ్ తో పోరాడినప్పటికీ కూడా అటు ఇంగ్లాండ్ జట్టు మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో చివరికి టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.
ఇకపోతే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ విజేత కావడంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ ప్రపంచకప్ ద్వారా ఒక పాఠం నేర్చుకోవాలి. పాకిస్తాన్ కేవలం బౌలింగ్ ద్వారా మాత్రమే వరల్డ్ కప్ గెలవలేదు. భారత్ కేవలం బ్యాటింగ్ ద్వారా మాత్రమే విజేత అవ్వలేదు. అటు ఇంగ్లాండ్ జట్టుకు బ్యాట్స్మెన్లు, బౌలర్లు, ఫీల్డర్లు మరోవైపు నుంచి అదృష్టం ఉండడం వల్లనే అటు విశ్వవిజేతగా నిలిచింది అంటూ మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి.