టీమిండియా ఓటమికి కారణం అదే.. అలా చేసి ఉంటే : సచిన్

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ రోహిత్ సారధ్యంలో బలిలోకి దిగిన టీమిండియా జట్టు వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అని భారత అభిమానులు అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించబోతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో టీమిండియా అందరి నమ్మకాన్ని వమ్ము చేసింది. లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసి అటు ప్రత్యర్థి  పై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించిన టీమిండియా ఇక కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.


 ఇక ఇండియా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టీమిండియా సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినందుకు కూడా భారత అభిమానులు బాధపడేవారు కాదేమో.. కానీ ఇండియా లాంటి ఒక పటిష్టమైన జట్టు ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వకుండా పదవి వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవి చూడటాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. మాజీ ఆటగాళ్లు సైతం ఈ ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.


 ఇటీవలే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం వరల్డ్ కప్ లో భాగంగా సెమి ఫైనల్లో టీం ఇండియా ఓటమిపై స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఓడిపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ ముందు మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించకపోవడమే ఇండియా ఓటమిక కారణం అని చెప్పుకొచ్చాడు. ఆడిలైట్ లాంటి మైదానంలో 168 అంటే చాలా తక్కువ స్కోరు. సైడ్ బౌండరీలు చాలా చిన్నగా ఉంటాయి. అందుకే190 స్కోర్ చేసి ఉంటే బాగుండేది. పదవి వికెట్ల తేడాతో ఓడిపోవడం చెత్త ఓటమి అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: