రేట్ పెంచిన సూర్య కుమార్.. నెలకు ఎంత తీసుకుంటున్నాడంటే?
ఇకపోతే ఇటీవల కాలం లో తన అద్భుతమైన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారి పోయిన సూర్య కుమార్ యాదవ్ సైతం ప్రస్తుతం ఇక తన సంపాదన అంతకంతకు పెంచు కుంటున్నాడు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ప్రస్తుతం పిచ్ లతో సంబంధం లేకుండా పరుగుల వరద పాలిస్తున్న సూర్య కుమార్ యాదవ్ తో తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవాలని ఎన్నో బడాబడా కంపెనీలు సైతం వెంటపడుతున్నాయి అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే 10 బ్రాండ్లకు ప్రచార కర్తగా ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్.
ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీలు అతని తో ప్రమోషన్స్ చేయించుకోవాలని సిద్ధంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇక త్వరలోనే మరో ఏడు కంపెనీలకు ప్రమోట్ చేసేందుకు సూర్యకుమార్ సైన్ చేయ బోతున్నాడట. అయితే ఇక అతను పారితోషకాన్ని కూడా ఒక్కసారిగా పెంచేసినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వివిధ కంపెనీల బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గాను నెలకు 20 లక్షల వరకు వసూలు చేసే వాడట. కానీ ఇప్పుడు ఏకంగా 70 లక్షల వరకు తీసుకుంటున్నాడట సూర్య కుమార్ యాదవ్.