టీమిండియా ఓడినా.. కోహ్లీ మాత్రం రికార్డు సృష్టించాడు?

praveen
విరాట్ కోహ్లీని...  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా రికార్డుల రారాజు అనే పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు అలాంటివి అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ ఇక ఏ ఫార్మాట్లో ఆడిన కూడా తనకంటూ ప్రత్యేకమైన రికార్డును సృష్టిస్తూ ఉంటాడు. ఇక రికార్డుల విషయంలో అయితే నేటితరం క్రికెటర్లకు అందనంత దూరంలో ఉన్నాడు కోహ్లీ. ఎన్ని పరుగులు చేసిన ఎంతమంది దిగజాల రికార్డులు బ్రేక్ చేసిన ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగానే తన ఆట తీరును కొనసాగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ మళ్ళి మునపటి ఫామ్ ను అందుకొని వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 ప్రతి మ్యాచ్ లో కూడా జట్టుకు విజయాన్ని అందించే ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ ప్రేక్షకులను ఫిదా చేసేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా వరల్డ్ కప్ లో భాగంగా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోహ్లీ మరోవైపు వరుసగా అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన ఇండియా జట్టు ఇంటి బాట పట్టింది.

 అయితే టీమిండియా ఓడిపోయినప్పటికీ కూడా అటు విరాట్ కోహ్లీ మాత్రం ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఏకంగా అంతర్జాతీయ టి20లలో 4000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ ఆసక్తికర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోర పరాభవాన్ని చదివి చూడడాన్ని అభిమానులు మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: