ఇంగ్లాండ్ ను చూసి ఇండియా భయపడుతుంది : మైఖేల్ వాన్

praveen
వరల్డ్ కప్ లో భాగం గా ప్రస్తుతం  మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్  జరుగుతూ ఉండగా.. రేపు ఆడి లైట్ వేదికగా అటు ఇంగ్లాండ్ టీమిండియా మధ్య రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇక రెండు దిగ్గజ జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ పోరు ఎంతో రసవతరం గా మార బోతుంది అన్నది ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకుల అంచనా. అయితే ప్రస్తుతం సెమీఫైనల్ లో మాత్రం అటు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది టీమ్ ఇండియా అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.


 ఇప్పటివరకు సూపర్ 12 మ్యాచ్ లలో భాగంగా టీమిండియా అసామాన్యమైన ప్రతిభ కనబరిచింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు మరోవైపు పటిష్టంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాను ఎలా ఎదుర్కో బోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ నేపథ్యంలో ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఈ మ్యాచ్ పై స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఏ జట్టు విజయం సాధిస్తుంది అనే దానిపై ముందుగానే జోష్యం చెబుతున్నారు.


 ఇకపోతే రేపు ఆడిలైట్ వేదికగా జరగబోతున్న ఇంగ్లాండ్, టీమిండియా మ్యాచ్ గురించి అటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా భయపడుతూ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. ఇంగ్లాండ్ మాత్రం మొదటి నుంచి ఎంతో దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది. ఇక విరాట్ కోహ్లీని పరుగులు చేయకుండా కట్టడి చేయాలి.  చెత్త బంతులను విసరకూడదు. అంతే కాకుండా ఫీల్డింగ్ కూడా టైట్ చేయాలి.. అప్పుడు కోహ్లీ దొరికిపోతాడు అంటూ మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లు తమ బౌలింగ్లో చక్కటి వేరియేషన్స్ చూపిస్తున్నారు. ఇక సెమిస్లో తన ఫేవరెట్ ఇంగ్లాండ్ జట్టే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: