వరల్డ్ కప్ : సెమీస్ లో అంపైర్లు వీళ్లే?

praveen
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం నవంబర్ 9 వ తేదీన ప్రారంభం కాబోయే సెమీఫైనల్ ఫోర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. నవంబర్ 9, 10 తేదీలలో వరసగా రెండు రోజులపాటు సెమి ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది నేరుగా స్టేడియం కు వెళ్లడానికి ఇంకొంతమంది టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించడానికి సిద్ధమైపోతున్నారు. ఇక ఈ సెమీఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారు అనే విషయంపై అభిమానులు మాజీ ఆటగాళ్లు కూడా తమ అంచనాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ ఉండటం గమనార్హం.


 సాధారణంగానే టి20 వరల్డ్ కప్ అంటే చాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది సెమీఫైనల్ లో మ్యాచ్ అంటే ఇక ఆటగాళ్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కేవలం ఆటగాళ్ల మీద మాత్రమే కాదు అటు మ్యాచ్ కు రిఫరీలుగా ఉండే అంపైర్ల మీద కూడా అదే రీతిలో ఒత్తిడి ఉంటుంది. ఇక ఎంపైర్లు  తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో ఆలోచించి ప్రతి విషయాన్ని గమనించి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ పోరుకు ఎవరు అంపైర్లుగా  వ్యవహరించబోతున్నారు అన్న విషయం తెలుసుకోవడానికి కూడా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.


ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే... సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య నవంబర్‌ 9న జరగబోయే తొలి సెమీఫైనల్‌కు ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా మరయిస్‌ ఎరాస్మస్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ లను ఎంపిక చేయగా.. రిచర్డ్‌ కెటిల్‌బొరో, మైఖేల్‌ గాఫ్‌లు థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్లుగా వ్యవహరించబోతున్నారు. ఈ మ్యాచ్‌కు రిఫరీగా క్రిస్‌ బ్రాడ్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది .

ఇక, నవంబర్‌ 10న అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం.. కుమార ధర్మసేన, పాల్‌ రిఫిల్‌ ఫీల్డ్‌ అంపైర్లుగా.. క్రిస్‌ గఫానీ, రాడ్‌ టక్కర్‌ థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్లుగా, డేవిడ్‌ బూన్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: