వావ్.. మిస్టర్ 360 సూర్య.. వరల్డ్ రికార్డ్?
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లలో జింబాబ్వే భారత్ మ్యాచ్ జరగగా... ఇక ఈ మ్యాచ్ లో భాగంగా సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మైదానం నలువైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడి క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం మంత్రముగ్ధులను చేశాడు సూర్య కుమార్ యాదవ్. 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.
అదే సమయంలో ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ ఏడాది టీ20 లో 1000 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సూర్య కుమార్ యాదవ్.. ఒక క్యాలెండర్ ఇయర్ లో టీ20 ఫార్మాట్లో ఇక ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక అతని తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 924 పరుగులతో ఉండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 731 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు.