ప్లీజ్ మా కోసం గెలవండి.. శ్రీలంకను వేడుకున్న మాక్స్ వెల్?
ఈ క్రమంలోనే నేడు ఒక కీలకమైన మ్యాచ్ జరగబోతుంది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కీలకమైన మ్యాచ్ లో బాగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు చివరికి భారీ తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే సెమీస్ అవకాశాలను సజీవంగా అయితే ఉంచుకుంది కానీ ఇప్పుడు సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాలి అంటే మాత్రం ఆస్ట్రేలియా భవితవ్యం శ్రీలంక జట్టు చేతిలోఉంది అని చెప్పాలి. శ్రీలంక చేతిలో అటు ఇంగ్లాండ్ జట్టు ఓడితేనే ఆస్ట్రేలియా సమీకరణాలు లేకుండా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది.
కానీ ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం ఇరు జట్లకు సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ ఇంగ్లాండుకు ఎక్కువ ఉండడం కారణంగా ఇంగ్లాండ్ సెమిస్ చేరుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల మాట్లాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని కఠిన పరిస్థితుల మధ్య విజయం సాధించాం.. ఇక ఇప్పుడు మమ్మల్ని సెమీఫైనల్కు చేర్చేందుకు శ్రీలంక తప్పకుండా మా కోసం అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శిస్తుంది అనే నమ్మకం ఉంది అంటూ ఆశా భావం వ్యక్తం చేశాడు మ్యాక్స్ వెల్. ఏం జరుగుతుందో చూడాలి మరి.