ఐసీసీ ఇండియాకు అనుకూలంగా ఉంది.. ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్?

praveen
భారత క్రికెట్ పై ఎప్పుడు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు తమ అక్కస్సు వెల్లగక్కుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. భారత జట్టు ఏదైనా ఘనత సాధించిన లేదా టీమిండియా ఆటగాళ్లు బాగా రాణించి రికార్డు కొట్టినా కూడా అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపిస్తూ ఉంటే.. పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అని చెప్పాలి. మొన్నటికి మన సౌత్ ఆఫ్రికా పై భారత్ ఓడిపోయినప్పుడు ఇక పాకిస్తాన్ ను ఇంటికి పంపించాలని ఉద్దేశంతోనే భారత్ ఓడిపోయింది అంటూ విమర్శలు చేయడం చూశాం.

 ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించడాన్ని అటు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం అస్సలు ఓర్వలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్న విషయం ఇటీవలే బంగ్లాదేశ్ భారత్ మధ్య మ్యాచ్ ద్వారా మరోసారి నిరూపితం అయింది అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.

 ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. అవును ఈ మ్యాచ్లో షాకిబూల్ హసన్ కూడా అదే చెప్పాడు. వర్షం ముగిశాక గ్రౌండ్ ఎంత తడిగా ఉందో చూశారు కదా. అయినా మ్యాచ్ కొనసాగేలా ఎంపైర్లు  నిర్ణయం తీసుకున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఐసీసీ భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఐసీసీకి బీసీసీఐ గెలవడం కావాలి. భారత్ ఎలాగైనా సెమిస్ చేరాలి. అందుకే అంపైర్లు భారత్ పాకిస్తాన్, మ్యాచ్లో వ్యవహరించినట్లుగానే బంగ్లాదేశ్ తో మ్యాచ్లో కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు గాని వాళ్ళకి బెస్ట్ ఎంపైర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: