రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరు నడుస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. అలాంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ రెండు పార్టీలను కాదని బిజెపి ఈ ఎన్నికల్లో గెలిచి వారి బలమెంటో చూపించుకోవాలని తహతహలాడుతోంది. ఈ విధంగా ఈ మూడు బలమైన పార్టీలే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా ఎంతో మంది అభ్యర్థులు పోటీ చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ఇలా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను కాస్త లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వస్తే వస్తాయి లేదంటే లేదు అనే విధంగా ముందుకు వెళుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దీన్ని గట్టిపట్టుగా తీసుకున్నటువంటి గులాబీ పార్టీ ఎలాగైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ పడేలా చూడాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరూరి రమేష్ గులాబీ పార్టీలో చేరగా..గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు కూడా సొంతగూటికి రాబోతున్నారనే వార్తలు అనేకం వినిపిస్తున్నాయి. అంతేకాదు మొన్నటికిమొన్న కేసీఆర్ ను సిట్ విచారణ చేసిన సందర్భంగా ఆయనతో ఫోటో దిగి మహిపాల్ రెడ్డి సోదరుడు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో హల్చల్ చేశారు. ఇక వీళ్లే కాకుండా మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా గులాబీ గూటికి రాబోతున్నారనే గుసగుసలు రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం,నిజాంబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలే ఉన్నట్టు సమాచారం అందుతోంది.
వారు ఎప్పుడు గులాబీ బాస్ సమక్షంలో పార్టీలో చేరుతారో తెలియదు. కానీ ఈ మాజీ నాయకుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏనుగు రవీందర్ రెడ్డి, జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పటికీ కాస్త అభివృద్ధిలో వెనుకబడిపోయింది. దీంతో అదే పార్టీలో కాస్త పట్టింపు లేని కొంతమంది నాయకులు గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంటుందో అబద్ధం ఉంటుందో ముందు ముందు క్లారిటీ వస్తుంది.