వరల్డ్ కప్ లో పరువు కోసం "పాకిస్తాన్" పాకులాట ?

VAMSI
టీ 20 వరల్డ్ కప్ 2022 ముగియడానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఆస్ట్రేలియా వేదికగా మూడు వారాల నుండి ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. సెమీఫైనల్స్ కు అర్హత సాధించే జట్ల గురించి గ్రూప్ 2 లో ఒక క్లారిటీ వచ్చినా, గ్రూప్ 1 లో మాత్రం ఏ రెండు జట్లు సెమీస్ కు వెళ్లనున్నాయి అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. గ్రూప్ 1 లో సెమీస్ కు వెళ్లేందుకు ఛాన్స్ ఉన్న వాటిలో ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ 2 లో చూసుకుంటే ఇండియా మరియు సౌత్ ఆఫ్రికాలు సెమీస్ చేరుతాయని తెలుస్తోంది. ఇక ఎన్నో అంచనాలతో వరల్డ్ కప్ లో అడుగు పెట్టిన పాకిస్తాన్ కు మరోసారి భంగపాటు తప్పడం లేదు.
ఇప్పటి వరకు పాక్ ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయి సెమీస్ కు దూరమైంది. ఒకవేళ నిన్న బంగ్లా గెలిచి ఉంటే పాక్ కు ఛాన్స్ ఉండేది. కనీసం మిగిలిన రెండు మ్యాచ్ లలో అయినా గెలిచి పరువును దక్కించుకోవాలని బాబర్ ఆజామ్ అండ్ కో సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఈ రోజు ఇంకాసేపట్లో సౌత్ ఆఫ్రికా తో తలపడనుంది. సౌత్ ఆఫ్రికా ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉంది.. తాను ఆడిన మూడు మ్యాచ్ లలో రెండింటి గెలిచి ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు మ్యాచ్ కనుక గెలిస్తే నేరుగా సెమీఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా పాక్ కనుక గెలిస్తే సౌత్ ఆఫ్రికాకు సెమీస్ లో మొదటి స్థానం దక్కకపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
ముఖ్యంగా పాకిస్తాన్ ఈ స్థాయిలో వరల్డ్ కప్ లో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ జట్టు ఓపెనింగ్ ఫెయిర్ అని చెప్పాలి. వీరు సరిగా రాణించకపోవడం మూలానే పాకిస్తాన్ జింబాబ్వే జట్టుతో సైతం ఓడిపోయింది. ఈ రోజు అయినా తమ జట్టు డెవలప్మెంట్ కు మూలస్థంభాలైన బాబర్ ఆజామ్ మరియు మహమ్మద్ రిజ్వాన్ లు ఆడి సౌత్ అరిచాను ఓడించి పరువు దక్కించుకుంటారేమో చూడాలి.  
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: