అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సేమ్ టు సేమ్?

praveen
క్రికెట్లో వందల మ్యాచులు జరుగుతున్న ఇక కొన్ని జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్న సమయంలో మాత్రం గతంలో ఎన్నో ఏళ్ల కింద రిపీట్ అయిన ఘటనలు కూడా మళ్లీ ప్రస్తుత మ్యాచ్లలో కూడా రిపీట్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి ఏదైనా జరిగాయి అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి అని చెప్పాలి. ఇటీవల బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో లిటెన్ దాస్ రన్ అవుట్.. ఇక గతంలో 2016లో టి20 ప్రపంచ కప్ లోఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ధోని చేసిన రన్ అవుట్ సేమ్ టు సేమ్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిస్తున్నాయి.


 ఇంతకీ 2016లో ఏం జరిగిందంటే టి20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే ఇండియా విజయం సాధించింది.  ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. ఒక పరుగులు చేస్తే మ్యాచ్ టై  అవుతుంది. ఇలాంటి సమయంలో చివరి బంతి వేసే ముందు ధోని పాండ్యాతో కాసేపు చర్చించి మాస్టర్ మైండ్ లో ఉన్న ఆలోచన పాండ్యాకు చెప్పాడు. చివరికి బంతి సింగిల్ తీసే ప్రమాదాన్ని ముందే గ్రహించిన ధోని కుడిచేతి గ్లౌజ్ తీసి రెడీగా ఉన్నాడు. క్రీసులో ఉన్న బ్యాట్స్మెన్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని బాధేందుకు ప్రయత్నించిన కుదరలేదు. బంతి మిస్ అయ్యి ధోని చేతిలోకి వెళ్ళింది. దీంతో ధోని పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను కొట్టి  రనౌట్ చేశాడు.



 ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటెన్ దాస్  ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దొరికిన బంతినల్లా బౌండరీకి తరలిస్తూ వీర విహారం చేశాడు. 7 ఓవర్లకే బంగ్లా స్కోరు 66 గా ఉంది. దీంతో భారత శిబిరంలో గుబులు మొదలైంది. ఇక ఆ తర్వాత వర్షం అంతరయం కలిగించడం జరగగా.. మళ్లీ మ్యాచ్ మొదలైంది. అయితే అశ్విన్ ఎనిమిదో ఓవర్ వేసాడు. రెండో బంతికి శాంతో డీప్ మెడికేట్ దిశగా కొట్టగా. ఒక పరుగు పూర్తయింది రెండో పరుగు కోసం  పరిగెత్తగా అప్పుడే బంతిని అందుకున్న రాహుల్ చివరికి త్రో వేసాడు. కళ్ళు మూసి తెరిచే లోపె లిటెన్  దాస్ రన్ అవుట్  అయ్యాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: