టీమిండియాలో ఉమ్రాన్ మాలిక్.. ఈసారి ఏం చేస్తాడో?
ఇక గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఉమ్రాన్ మాలిక్ ను నెట్ బౌలర్గా తీసుకుంది బీసీసీఐ. ఇక ఈ ఏడాది జూన్ 26వ తేదీన జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భాగంగా ఐర్లాండ్తో తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు ఉమ్రాన్ మాలిక్. కానీ ఆ తర్వాత బౌలింగ్లో వేగం ఉన్నప్పటికీ లైన్ అండ్ లెంత్ లో మాత్రం ఉమ్రాన్ మాలిక్ సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక తద్వారా జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. అతను బాగా రానించి ఉంటే వరల్డ్ కప్ లో చోటు తగ్గుతుందని అనుకున్నప్పటికీ అది కుదరలేదు.
ఎట్టకేలకు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ ఫేస్ సంచలనం. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అటు న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుండగా.. టి20, వన్డే సిరీస్ లు ఆడనుంది టీం ఇండియా. ఈ రెండు జట్లలో కూడా చోటు సంపాదించుకున్నాడు ఉమ్రాన్. కాగా న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఎంపికయ్యాడు. నవంబర్ 18న వెళ్లింగ్ టన్ లో ఇక ఈ టి 20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 25 నుంచి న్యూజిలాండ్ లో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు భారత జట్టుకూ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. మరి ఈసారి ఉమ్రాన్ మాలిక్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.