కొత్త సెంటిమెంట్.. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడితే.. వరల్డ్ కప్ మనదే?
ఇలా టీమ్ ఇండియా అభిమానులు భారత జట్టు ఓటమిపాలైన ఆనందపడటానికి రెండు కారణాలు ఉన్నాయి అని చెప్పాలి. అందులో ఒకటి వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ వైదొలికి ఇంటి బాట పడుతుంది. ఎందుకంటే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలిచి ఉంటే మాత్రం ఇక పాకిస్తాన్ కు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పాకిస్తాన్ ను పరోక్షంగా ఇంటికి పంపిస్తున్నందుకు భారత ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
మరోవైపు ఇక వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో లీగ్ దశలో ఓడిపోతే టీమిండియా తప్పకుండా ప్రపంచ కప్ గెలుస్తుంది అనే సెంటిమెంట్ ని బాగా నమ్ముతున్నారు టీమిండియ అభిమానులు. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు లీగ్ దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 296 పరుగులు చేయగా... ఒక మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన సాఫ్తాఫ్రికా రెండు బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించి టీమిండియాని ఓడించింది. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో కూడా సరిగ్గా రెండు బాల్స్ మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా విజయం సొంతం చేసుకుంది. దీంతో 2011 వరల్డ్ కప్ సెంటిమెంట్ ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తూ సంతోషంలో మునిగిపోతున్నారు.