పాక్ సెమిస్ లో అడుగు పెట్టాలంటే.. ఇలా జరగాలి?

praveen
ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు చివరి వరకు పోరాడి ఓడింది అని చెప్పాలి. అయితే భారత జట్టు విజయం సాధించాలని పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే భారత జట్టు విజయం సాధిస్తే అటు పాకిస్తాన్కు సెమీఫైనల్ లో అడుగుపెట్టి అవకాశాలు మరింత మెరుగుపడతాయని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో అటు భారత జట్టు మాత్రం సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్లో ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో ఇక పాకిస్తాన్ చాప చుట్టేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి అని చెబుతున్నారు. అయితే అటు పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరాలి అంటే అద్భుతాలు జరగాల్సి ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్కం. ఇప్పుడు పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ లో ఫలితం మీదే కాదు ఇతర జట్లు ఆడబోయే ఫలితం మీద కూడా పాకిస్తాన్ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది అని అంటున్నారు. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా పై టీమ్ ఇండియా ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా పాకిస్తాన్ కి కొన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.


 పాకిస్తాన్ జట్టు మిగిలిన అన్ని మ్యాచ్లలో కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది.
 ఇక జింబాబ్వే బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవాల్సి ఉంది.

 అంతేకాకుండా బంగ్లాదేశ్ నెట్ రన్ రేట్  పాకిస్తాన్ కంటే తక్కువగా ఉండాలి.

 ఇక మరో మ్యాచ్ లో జింబాబ్వేను నెదర్లాండ్స్ ఓడించాల్సి ఉంది.

 ఒకవేళ భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే అటు నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పాకిస్తాన్ భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండాలి. ఇవి జరిగితేనే పాక్ సెమిస్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: