ఏంటి.. భారత్ కావాలనే ఓడిపోయిందా?
ఇలా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పటికీ మిగతా రెండు మ్యాచ్లలో గెలవాలని అటు అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు భారత ఓటమిపై కొత్త చర్చ తెర మీదికి వచ్చింది. భారత జట్టు కావాలనే ఓడిపోయింది అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ అభిమానులు అయితే భారత ఓటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ గెలిచి ఉంటే పాకిస్తాన్ కి సెమిస్ చేరే అవకాశాలు మెరుగుపడేవి. ఇక అలా జరగకుండా అటు పాకిస్తాన్ ఇంటికి పంపించాలని ఉద్దేశంతోనే భారత్ కావాలని ఓడిపోయింది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.
గతంలో కూడా ఇలా టీమిండియా ఎన్నోసార్లు చేసిందని.. ఇక ఇప్పుడు కూడా కక్షపూరితంగానే భారత్ గెలవాల్సిన మ్యాచ్లో కూడా కావాలనే ఓడిపోయింది అంటూ విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం ఇలాంటి విమర్శలను చూసి అటు భారత క్రికెట్ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఎవరికో మేలు జరుగుతుందని భారత ఆటగాళ్లు ఆడరని.. కేవలం జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఆడుతూ ఉంటారని.. ఇక ఇలా విమర్శలు చేస్తున్న వారికి భారత అభిమానులు కౌంటర్లు ఇస్తూ ఉండడం గమనార్హం.