టీమిండియాలోకి అతనొక్కడు వస్తే.. ఇక తిరుగుండదు : కపిల్ దేవ్

praveen
ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా మంచి ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇటీవల దక్షిణ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో మాత్రం పోరాడి ఓడింది అన్న విషయం తెలిసిందే. ఈ బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో కొంతమంది ఆటగాళ్ల పేలవ ప్రదర్శన మాత్రం టీమ్ ఇండియాను కలవరపెడుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక జట్టు కూర్పు విషయంలో భారత మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ టీమ్ ఇండియాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉండటం గమనార్హం .


 ఈ క్రమంలోనే  వరల్డ్ కప్ ప్రారంభం అయిననాటి నుంచి కూడా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాకుండా టీమిండియా కు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం  ఇకపోతే ఇటీవలే టీమ్ ఇండియాలోకి ఒక ఆటగాడిని తీసుకోవాలి అంటూ కపిల్ దేవ్ సలహా ఇచ్చాడు. ఇప్పటికే పరిపూర్ణంగా ఉంది. కానీ ఇక టీమిండియాలో మరింత ఉత్తేజం నిండాలి అంటే మాత్రం రిషబ్ పంత్ లాంటి ఆటగాడు జట్టులో భాగం కావాల్సిందే అంటూ వ్యాఖ్యానించాడు.


 దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ లాంటి వికెట్ కీపర్ అవసరమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ మనకు కీలకమైనప్పుడు.. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఎంతో అవసరం అతడుంటే టీమిండియా పరిపూర్ణం అవుతుంది అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. అదే సమయంలో పాకిస్తాన్ నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లలో రాణించలేకపోయిన కేఎల్ రాహుల్ ఫామ్ పై మాట్లాడుతూ.. అతడు బాగా ఆడగలరు ఇది వరకు మ్యాచ్లో రాహుల్ బ్యాటింగ్ చూస్తే తను ఎప్పుడు కష్టపడుతున్నట్లుగా అనిపించలేదు. ఎక్కువ రన్స్ చేయడం కేఎల్ రాహుల్ కు ఎంతో కీలకం. మొదట నిదానంగా ఆడిన అవసరమైనప్పుడు వేగం పుంజుకోగలడు అంటూ మద్దతుగా నిలిచాడు కపిల్ దేవ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: