శ్రీలంకతో మ్యాచ్ కూ ముందు.. న్యూజిలాండ్ కి గుడ్ న్యూస్?
ఈ క్రమంలోనే అతను లేకుండానే మిగతా మ్యాచ్లను ఆడింది న్యూజిలాండ్. అయితే ఇక నేడు మరో కీలకమైన మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. సిడ్ని వేదికగా శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే శ్రీలంకతో మ్యాచ్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది అన్నది తెలుస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ డార్లి మిచిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ వెటరన్ ఫేసర్ టీమ్ సౌతి కూడా ధృవీకరించాడు.
కొన్ని రోజుల క్రిందట గాయపడ్డ డార్లి మిచిల్ ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్ కూ జట్టు సెలక్షన్ కి అందుబాటులోకి వచ్చాడు అంటూ తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న మార్క్ చాప్ మన్ స్థానంలో జట్టులోకి డార్లి మిచిల్ రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. డార్లి మిచిల్ మా చెట్టులో కీలక సభ్యుడు. అతడు గతంలో మా జట్టు విజయాలకు కీలక పాత్ర వహించాడు అంటూ టిమ్ సౌదీ చెప్పుకొచ్చాడు కాగా గత ఏడాది ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరడంలో డార్లి మిచిల్దే కీలకపాత్ర అని చెప్పాలి.