వరల్డ్ కప్ నెంబర్.1 స్థానానికి.. అడుగు దూరంలో కోహ్లీ?
ఇక హాఫ్ సెంచరీలు చేయడంలో కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులు సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో లెజెండరీ క్రికెటర్లుగా ఉన్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా చేదించి తన పేరున ఆ రికార్డులను లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే మొన్నటి వరకు ఫామ్ లేమి తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ మళ్ళీ ఇప్పుడు మునపటి ఫామ్ అందుకుని మరోసారి హై స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై వీర విహారం చేస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కూడా మరోసారి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టి20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ లో 21 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ 12 హాఫ్ సెంచరీలతో 989 పరుగులు చేశాడు. కాగా కోహ్లీ కంటే ముందు ఒక వెయ్యి 16 పరుగులతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఫామ్ బట్టి చూస్తే ఇక జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు అన్నది అందరికి తెలిసిందే..