హీటెక్కనున్న సమ్మర్.. ఎన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున సినిమాలు సమ్మర్ కానుకగా విడుదల అవుతూ ఉంటాయి. ఎక్కువ శాతం సమ్మర్ సీజన్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక ఆ సీజన్లో విడుదల అయిన సినిమాలకు మంచి కలెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. దానితో పెద్ద ఎత్తున స్టార్ హీరోలు నటించిన సినిమాలను ఆ సీజన్లో విడుదల చేయడానికి నిర్మాతలు కూడా అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇకపోతే వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా కూడా చాలా క్రేజీ సినిమాలో విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు చాలా మూవీ బృందాలు అధికారికంగా ప్రకటించాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిరంజీవి స్వయంగా తెలియజేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. ఇకపోతే నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.


ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పెద్ది సినిమాను కూడా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతుంది. ఆ సినిమా షూటింగ్ ఈ రోజు స్టార్ట్ అయింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఈ మూవీ కి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా వచ్చే సంవత్సరం సమ్మర్ కి అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: