ఫ్రీ హిట్ బాల్ కి వికెట్ పడితే.. పరుగులు చేయొచ్చా?
విరాట్ కోహ్లీ ఫ్రీ హీట్ బంతికి వికెట్ కోల్పోయి ఇక బంతి వెనక్కి వెళ్ళిన సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాల్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత మూడు పరుగులు తీశాడు. తర్వాత అంపైర్లు కూడా లెగ్ బై సిగ్నల్ ఇస్తూ మూడు పరుగులు ఇవ్వడం గమనార్హం. అంపైర్ల నిర్ణయం పై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది అంపైర్ నిర్ణయాన్ని సమర్థిస్తే ఇంకొంమంది మాత్రం తప్పుపడుతున్నారు. ఇదే వివాదంపై ఆస్ట్రేలియా మాజీ అంపైర్ సైమన్ టవుపెల్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఫ్రీ హిట్ బాల్కు విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత మూడు పరుగులు తీయడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయంపై స్పందించాలని ఎంతోమంది నన్ను కోరుతున్నారు. అయితే ఎంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ టౌపెల్ వ్యాఖ్యానించాడు. బంతి స్టంప్స్ తాకిన తర్వాత గ్రౌండ్లోకి వెళ్లిందని... దీంతో బ్యాట్స్మెన్ 3 పరుగులు చేసిన తర్వాత బైస్ ని సూచించడం అంపైర్స్ సరైన నిర్ణయం అంటూ చెప్పాడు ఫ్రీ హిట్ బాల్ లో స్ట్రైకర్ ను అవుట్ చేయడం కుదరదు. కాబట్టి స్టంప్స్ తాకినప్పుడు బాల్ డెడ్ బాల్ అవ్వదని గుర్తు చేశాడు. అందుకే అంపైర్లు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ తెలిపాడు.