కోహ్లీ దేవుడు.. అందుకే ఇక్కడికి వచ్చా : అభిమాని

praveen
ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా సాధించిన అద్భుతమైన విజయంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. నరాలు తెగే ఉత్కంఠ  మధ్య అటు ప్రేక్షకులందరికీ పైసా వసూల్ మ్యాచ్ గా మారిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత మళ్లీ మిగతా మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ అందరూ మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. దయాధుల సమరానికి సంబంధించి ఒక్కో విషయం తెరమీదకి వస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి స్టేడియం కి హాజరైన ఎంతోమంది అభిమానులు ఇక టీమ్ ఇండియాకు మద్దతుగా ఎలాంటి ప్లకార్డులు పట్టుకున్నారు. అంతే కాకుండా ఏకంగా టీమిండియా క్రికెటర్ల పై ఉన్న తమ అభిమానాన్ని ఎలా చాటుకున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా అద్భుతమైన ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాని గెలిపించడంపై అందరూ చర్చించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మేల్ బోర్న్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా అటు ఒక అభిమాని పట్టుకున్న ఫ్లకార్డు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 సాధారణంగా కోహ్లీకి ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కోహ్లీ ఎక్కడికి వెళ్లి మ్యాచ్ ఆడిన కూడా ఎంతోమంది భారత అభిమానులు విదేశీ అభిమానులు కూడా అతనికి మద్దతు పలికేందుకు వస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్తో మ్యాచ్లో ఒక అభిమాని ఆసక్తికర ఫ్లకార్డు పట్టుకున్నాడు  దీపావళి సందర్భంగా గుడికి వెళ్ళమని మా అమ్మ చెప్పింది. అందుకే దేవుడిని చూసేందుకు ఇక్కడికి వచ్చాను అంటూ విరాట్ కోహ్లీ ఫోటోని పెట్టిన ప్లకార్డును పట్టుకున్నాడు అభిమాని. ఇది చూసి కోహ్లీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: