పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా.. కలా నిజమా?
ఈ క్రమంలోనే ఇక భారత్ పాకిస్తాన్ జట్లు రెండు కూడా కేవలం ఐసీసీ నిర్వహించే టోర్ని లలో మాత్రమే తలబడుతూ ఉంటాయి. అందుకే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా మరోసారి హోరాహోరీగా తలబడేందుకు సిద్ధమయ్యాయి భారత్ పాకిస్తాన్ జట్లు. అయితే క్రికెట్ సంబంధాలు లేకపోవడంతో ఈ రెండు జట్లు కూడా ఒక దేశంలో మరో దేశం పర్యటించడం జరగదు. కానీ దాదాపు 15 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్ లో భారత్ పర్యటనకు వెళ్లబోతుంది అన్నది తెలుస్తుంది.
అయితే వచ్చే ఏడాది అటు పాకిస్తాన్ లో ఆసియా కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక లాంటి జట్లు కూడా పాకిస్తాన్లో పర్యటించారు. అయితే భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్తుందని కానీ ఇది పక్కాగా మాత్రం చెప్పలేమని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. బీసీసీఐ సర్వ సభ్య సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారట. కానీ చివరికి ప్రభుత్వానీదే తుది నిర్ణయం అన్నది మాత్రం తెలుస్తుంది. కాగా 2008లో చివరిసారిగా భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించింది. అప్పుడు అక్కడ ఆసియా కప్ లో పోటీ పడింది అని చెప్పాలి. అప్పుడు నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్లో అడుగుపెట్టలేదు భారత జట్టు.