సెంచరీ చేసినా శ్రేయస్ కు షాక్.. అతను రిజర్వ్ ఆటగాడిగా కూడా పనికిరాడా?
శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం బీసీసీఐ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇటీవలే వన్డే సిరీస్ లో బాగా రాణించిన శ్రేయస్ అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోవడం కాదు అటు రిజర్వు ఆటగాడిగా కూడా అతని తొలగిస్తూ ఘోరంగా అవమానించింది అని చెప్పాలి. వరల్డ్ కప్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితా నుంచి అతని పేరును తొలగించింది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడాలి అంటూ బీసీసీఐ శ్రేయస్ అయ్యార్ ను ఆజ్ఞాపించింది అన్నది తెలుస్తుంది. ఇక బిసిసిఐ తీసుకున్నఈ నిర్ణయంతో శ్రేయస్ అయ్యర్ అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు.
అయితే శ్రేయస్ అయ్యర్ తో పాటు రిజర్వు ఆటగాడిగా ఎంపికైన మరో ఆటగాడు రవి బిష్ణయ్ కి కూడా ఇదే పరిస్థితి అని చెప్పాలి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్ జట్టులో ఆడాలి అంటూ అతనికి బిసిసిఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక టి20 వరల్డ్ కప్ లో ఎవరైనా గాయపడితే ఆస్ట్రేలియాకు రమ్మని పిలుపు అందిస్తామని.. ఇక బీసీసీఐ అధికారులు ఇద్దరు ఆటగాళ్లకు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. కాగా బీసీసీఏ ఎంపిక చేసిన 15 మంది సభ్యులు కాకుండా మహమ్మద్ షమీ, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణయ్ లను రిజర్వు ఆటగాళ్లుగా ఎంపిక చేసింది బీసీసీఐ.