వార్నీ.. ఒక్క మ్యాచ్లో 11 మంది బౌలింగ్ చేశారు?
ఇక ఇలాంటి కొత్త రూల్స్ ఏవి వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి. అయితే ఇక మైదానంలో మ్యాచ్ ఆడే ఆటగాళ్లు అందరూ కూడా ఇలాంటి రూల్స్ పాటిస్తూనే క్రికెట్ కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ప్రేక్షకులందరికీ తెలిసిన రూల్స్ ప్రకారం ఒక మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఒక జట్టు తరఫున నలుగురు లేదా ఐదుగురు బౌలింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అవసరమైనప్పుడు ఆరవ బౌలర్ ని కూడా బరిలోకి దింపడం మనం చూస్తూ ఉంటాం. అయితే బ్యాట్స్మెన్ లపై ఎక్కువ ఫోకస్ పెట్టే జట్లు ఇక బౌలర్లను కాస్త తక్కువగానే జట్టులోకి తీసుకుంటుంది.
కానీ ఒక జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లు కూడా బౌలింగ్ వేయడం ఎప్పుడైనా విన్నారా.. లేకపోతే చూశారా అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి లేదు అని సమాధానమే వినిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. ఏకంగా జింబాబ్వే జట్టులో మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. టీ20 ప్రపంచ కప్ వార్మ్ అప్ మ్యాచ్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో జింబాబ్వే జట్టు సభ్యులైన 15 మందిలో కెప్టెన్ సహా మరో ఇద్దరు ఆటగాళ్లు మినహా మిగతా అందరూ ఆటగాళ్లు కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.