సెలెక్టర్లపై పృథ్వి షా అసంతృప్తి.. ఏమన్నాడో తెలుసా?
ఇక ఏమాత్రం పేలవ ప్రదర్శన చేసిన సెలక్టర్లు వారిని జట్టు నుంచి పక్కన పెట్టేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇక జట్టులో చోటు దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు ఎన్నోసార్లు నిరాశ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియాలోకి వచ్చి తక్కువ సమయంలోనే యువ సంచలనంగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు పృథ్వి షా. కానీ తర్వాత కాలంలో మాత్రం పేలవమైన ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు.
రంజీ ట్రోఫీ లో బాగా రాణించాడు. కానీ అతని సెలెక్టర్లు పరిగణ లోకి తీసుకోలేదు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో అతనికి చోటు దక్కుతుందని అతను ఆశపడ్డాడు. కానీ అది జరగలేదు. దీంతో సెలెక్టర్ ల పై అసంతృప్తి వ్యక్తం చేశాడు పృథ్వి షా. పరుగులు సాధిస్తున్న సెలెక్ట్ చేయడం లేదు.. జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందాను.. జాతీయ జట్టుకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వాళ్ళు ఎప్పుడు భావిస్తారో అప్పుడు నన్ను సెలెక్ట్ చేస్తారు. ఏ జట్టు తరుపున అయినా సరే నా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా.. ఫిట్నెస్ లో కూడా మరింత రాటుదేలుతున్నాను అంటూ పృథ్వి షా ఒక పోస్ట్ పెట్టాడు.