రోహిత్ సక్సెస్ సీక్రెట్ అదే : పార్థివ్ పటేల్

praveen
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఇప్పుడు సారథి అనే పదానికి అసలు సిసలైన అర్థం చెబుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే విరాట్ కోహ్లీ తర్వాత ఇక టీమ్ ఇండియా జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ తనదైన ఆటతీరుతో ఒకవైపు అభిమానులను అలరించడమే కాదు తన పదునైన వ్యూహాలతో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్లు ఎలాంటి ఎత్తులు వేసిన దానికి పైఎత్తు వేస్తూ రోహిత్ ప్రత్యర్థి  జట్లపై పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కాగా గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా తిరుగులేని విజయాలను సాధిస్తూ దూసుకుపోతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అయితే  ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు చూస్తే ఇక అటు ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించ లేకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా సిరీస్ లు విజయం సాధిస్తూ టీమిండియా దూసుకుపోతుంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే కెప్టెన్ గా రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్  అన్న విషయంపై ఎంతో మంది చర్చించుకుంటున్నారు


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లో లేని ప్లేయర్లతో ఎక్కువ సమయం గడుపుతాడని ఇక ఇదే అతని విజయాలకు కారణం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు వాళ్ళకి.  నేను ముంబై ఇండియన్స్ తరఫున 2016లో సరిగ్గా  ఇక ఆడలేదు ఆ సమయంలో రోహిత్ శర్మ నాకు సపోర్ట్ చేశాడు చాలాసేపు మాట్లాడాడు 2017-18 ఐపీఎల్ సీజన్ లో బాగా రాణించాను. అప్పుడు నాతో రోహిత్ మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చాడు కెప్టెన్ సపోర్ట్ చేస్తే ప్రతి ఆటగాడులో. ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది అంటూ తెలిపారు ఇండియాలో రోహిత్ రాహుల్ కాంబినేషన్ బాగుంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: