
అంబటి రాయుడు కెరియర్ నాశనం కావడానికి.. అదే కారణమా?
ఐపీఎల్ లో మాత్రం ఐదు టైటిల్స్ గెలిపించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు అంబటి రాయుడు. అయితే తన కోపమే తనకు శత్రువు అనే ఒక మాట పెద్దలు చెబుతూ ఉంటారు. అంబటి రాయుడు విషయంలో ఇలాంటిదే జరిగింది. 16 ఏళ్లకే ఒక భారీ సెంచరీ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. 2004 అండర్ 19 ప్రపంచ కప్లో శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తీక్ తో కలిసి ఆడాడు. ఇక వివిఎస్ లక్ష్మణ్ వారసుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక ఇక మ్యాచ్లో ఎప్పుడు కోపం ప్రదర్శిస్తూ ప్రత్యర్ధులతో గొడవ పడుతూ చివరికి కెరియర్ ని నాశనం చేసుకున్నాడు.
అయితే ఇరవై ఒకేళ్ళ వయసులో బీసీసీఐకి రెబల్గా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్ లో చేరి కెరియర్ లోనే ఘోర తప్పిదం చేశాడు అంబటి రాయుడు. దాంతో అతనిపై నిషేధం పడింది. ఒకవేళ ఇండియన్ క్రికెట్ లీగ్ లో అతను ఆడకుండా ఉండి ఉంటే కచ్చితంగా 2007 వరల్డ్ కప్ లో ఆడేవాడు. దీంతో స్టార్ క్రికెటర్ గా ఎదిగేవాడు. అయితే 2009లో అతనిపై నిషేధం ఎత్తివేసినప్పటికీ బీసీసీఐ మాత్రం అతనిపై పెద్దగా ఆసక్తి చూపలేకపోయింది. అడపాదడపు అవకాశాలు మాత్రం ఇస్తూ వచ్చింది. ఇలా అతని నిర్ణయాలు అతని కోపమే అతని కెరియర్ను నాశనం చేసింది అని ఇప్పటికీ కూడా క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు.