గుడ్ న్యూస్ చెప్పిన సౌరవ్ గంగూలీ.. వచ్చే ఏడాది నుంచి?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకం  గా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా ప్రపంచ క్రికెట్లో అత్యున్నత స్థాయికి ఎదిగింది అని చెప్పాలి. ఇటీవల ప్రసార హక్కుల కారణం గా ఐపీఎల్ స్థాయి మరింత పెరిగి పోయింది అని చెప్పాలి. ఈ క్రమం  లోనే ఐపీఎల్లో కేవలం భారత క్రికెటర్లు మాత్రమే కాదు విదేశీ క్రికెటర్లు కూడా భాగం కావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్లో ఆడటం కారణం గా ఒకవైపు డబ్బు రావడమే కాదు మరోవైపు పేరు  ప్రఖ్యాతలు కూడా వస్తాయి.

 అందుకే విదేశీ క్రికెటర్లు ఎంతోమంది తమ దేశ క్రికెట్ బోర్డు పర్మిషన్ తీసుకుని ఐపీఎల్లో ఆడటానికి ఆసక్తి చూపుతుంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే ఐపీఎల్ ద్వారా ఎంటర్టైన్మెంట్ పంచుతున్న బీసీసీఐ మహిళా ఐపీఎల్ నిర్వహించేందుకు కూడా సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. మహిళల క్రికెట్ ను కూడా ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న బిసిసిఐ  ఉమెన్స్ ఐపీఎల్ టోర్నీ నిర్వహించడానికి పూనుకుంది. దీంతో గత కొంత కాలం నుంచి ఉమెన్స్ ఐపీఎల్ టోర్నీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 ఈ క్రమం లోనే క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ఇటీవలే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు అని చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ టోర్నీ నిర్వహించబోతున్నట్లు స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లకు తెలియజేసినట్లు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా బాలికల కోసం అండర్ 15 టోర్నమెంట్ కూడా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాము అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలిసి ఎంతోమంది క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: