కోచ్గా ఇక నా ప్రస్థానం ముగిసింది : రవిశాస్త్రి
అతని కోచింగ్ లో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది అని చెప్పాలి. కేవలం వరల్డ్ కప్ లో తప్ప మిగతా అన్ని వేదికలపై కూడా టీమిండియా రవిశాస్త్రి కోచింగ్ లో చారిత్రాత్మక విజయాలను కూడా సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక హెడ్ కోచ్ గా ఏకంగా ఏళ్ళపాటు టీమిండియాకు సేవలు అందించాడు రవిశాస్త్రి. పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే హెడ్ కోచ్ పదవి నుండి తప్పుకొని మళ్ళీ కామెంటేటర్ గా అవతారమెత్తి అదరగొడుతున్నాడు.
ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ కు కమిషనర్గా కూడా వ్యవహరిస్తున్నాడు రవిశాస్త్రి... ఇకపోతే ఇటీవలే మీడియాతో మాట్లాడిన రవి శాస్త్రి మళ్లీ కోచ్ పదవి చేపట్టే విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ కోచ్ అవతారం ఎత్తే అవకాశం ఉందా అని పలువురు విలేకరులు రవిశాస్త్రినీ ప్రశ్నించారు. అయితే లేదు అంటూ సమాధానమిచ్చాడు రవి శాస్త్రి. ఏడేళ్లపాటు ఎంతో చేస్తాను. కోచ్గా నా ప్రస్థానం ముగిసింది. ఇకపై ఆటను దూరం నుంచి చూసి ఆస్వాదిస్తాను అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు...