కర్మ ఫలితం అంటే ఇదే.. పాక్ క్రికెటర్ పై ట్రోల్స్?
ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురిచేసే ఒకరు రనౌట్ కి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ఏ బ్యాట్స్మెన్ అయినా సరే పరుగు కోసం ప్రయత్నించినప్పుడు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా క్రీజులోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే బ్యాట్స్మెన్ కాస్త బద్దకస్తుడు.. ఇక్కడ జరిగిన ఘటన కూడా కాస్త వింత అయినది అని చెప్పాలి. బ్యాట్స్మెన్ రనౌట్ అయిన తీరు ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
పాకిస్థాన్కు చెందిన రోహేయిల్ నజీర్ అనే వికెట్ కీపర్ ముల్తాన్ వేదికగా నేషనల్ టి20 కప్ లో ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా నార్త్ రన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే కైబర్ ఫక్తున్వా జట్టుతో మ్యాచ్ జరుగగా బ్యాటింగ్ కి వచ్చాడు నజీర్. ఈ క్రమంలోనే ఫ్రీ హిట్ కి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ కు తగిలి గాల్లోకి లేచింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. ఫ్రీ హిట్ కావడంతో అవుట్ గా పరిగణించరు. ఇలాంటి సమయంలో ఒక పరుగు కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి బద్దకాన్ని ప్రదర్శించాడు. మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ప్రత్యర్థి ఫీల్డర్లు అప్రమత్తమై వికెట్లను గిరాటేసారు. దీంతో ఫ్రీ హిట్ కి కూడా అతనీ వికెట్ పోయింది.